Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్‌... 10 month ago

featured-image

ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పాఠ‌శాల విద్యాశాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు ఆరు ల‌క్ష‌ల‌కు పైగా అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తు చేస్తార‌ని అంచ‌నా. పోటీ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటున్న‌ప్ప‌టికీ అభ్య‌ర్దులు స‌రైన ప్ర‌ణాళిక‌తో స‌న్న‌ద్ధ‌మైతే ఈ అవ‌కాశాన్ని చేజిక్కించుకోవ‌చ్చు!


ఉపాధ్యాయ ఉద్యోగాల వివరణ:

మొత్తం పోస్టులు: 16,347

జిల్లా స్థాయి: 14,088

రాష్ట్ర/జోనల్ స్థాయి: 2,259


పోస్టుల వివరాలు:

ఎస్జీటీ (SGT): 6371

స్కూల్ అసిస్టెంట్ (SA): 7,725

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT): 1,781

 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT): 286

ప్రిన్సిపాల్స్: 52

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET): 132

క‌ర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,678 పోస్టులు ఉన్నాయి. అతి త‌క్కువ‌గా 543 పోస్టుల‌తో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది.


అర్హతలు:

SGT: AP ప్రభుత్వం లేదా NCTE గుర్తింపు పొందిన సంస్థ నుండి 50% గ్రాడ్యుయేషన్ మార్కులతో ఇంటర్మీడియట్, D.Ed/D.El.Ed లేదా B.Ed సర్టిఫికెట్ అవసరం.

SA: సంస్కృత డిగ్రీ లేదా తత్సమానం, సంస్కృతంలో బి.ఓ.ఎల్ లేదా పిజితో పాటు సంస్కృతంలో బి.ఎడ్ లేదా పండిట్ శిక్షణ అర్హత ప్రమాణంగా ఉండాలి.

TGT: AP TET/CTET అర్హత, UGC గుర్తింపు డిగ్రీ, NCTE గుర్తింపు బీఎడ్, RCI గుర్తింపు ప్రత్యేక విద్య, ఇంటర్ సర్టిఫికేట్ అవసరం.

PGT : NCTE గుర్తింపు, మాస్టర్స్/Bachelors డిగ్రీ, B.P.Ed/M.P.Ed, APTET/CTET అర్హతలు అవసరం, 50% మార్కులు తప్పనిసరి.

PET: AP ఇంటర్మీడియట్ లేదా తత్సమానత సర్టిఫికేట్, NCTE గుర్తించిన U.G.D.P.Ed లేదా B.P.Ed/M.P.Ed డిగ్రీ అవసరం.

ప్రిన్సిపాల్స్: 50% మార్కులతో గుర్తింపు పొందిన మాస్టర్స్ డిగ్రీ లేదా NCERT RIE నుండి 2 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ PG, NCTE-గుర్తింపు పొందిన B.Ed లేదా తత్సమానం.


 ప‌రీక్ష విధానం:

ప్రిన్సిప‌ల్, పీజీటీ, టీజీటీ పోస్టుల‌కు పేప‌ర్‌-1గా ఆంగ్ల భాష నైపుణ్య ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు 50 మార్కులు వ‌స్తేనే అర్హ‌త సాధించిన‌ట్లు ప‌రిగ‌ణిస్తారు. ఇందులో అర్హ‌త సాధిస్తేనే పేప‌ర్‌-2 మార్కులు లెక్కిస్తారు. ప్రిన్సిప‌ల్‌, పీజీటీల‌కు 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్‌, ఎస్టీటీ పోస్టుల‌కు ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్‌) వెయిటేజీ 20 శాతం ఉంటుంది.


అప్లికేష‌న్ వివ‌రాలు:

వ‌యోప‌రిమితిః అభ్య‌ర్ధుల‌కు జులై 1, 2024 నాటికి 18 నుంచి 44 సంవ‌త్స‌రాలు, ఎస్సీ/ ఎస్టీ/బీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్ధులకి 49 ఏళ్లు, దివ్యాంగుల‌కు 54 ఏళ్లు ఉండాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు ఒక్కో పోస్టుకు రూ. 750. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేది మే 15. ప‌రీక్ష తేదీలు జూన్ 6 నుండి జులై 6 వ‌ర‌కు జ‌రుగుతాయి. అభ్య‌ర్ధులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి చివ‌రి తేది మే 30. ప్రాథ‌మిక కీ ని చివ‌రి ప‌రీక్ష త‌ర్వాత 2వ రోజు విడుద‌ల చేస్తారు. ప్రాథ‌మిక కీ పై అభ్యంత‌రాల‌ స్వీక‌ర‌ణ‌కు 7 రోజుల గ‌డువును ఇచ్చి, త‌దుప‌రి వారం రోజుల్లో ఫైన‌ల్ కీ ఇస్తారు. అనంత‌రం వారం రోజుల్లో మెరిట్ జాబితాను విడుద‌ల చేస్తారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD